రంగారెడ్డి కలెక్టర్‌ను నటుడు మంచు మనోజ్ శనివారం కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి కలెక్టర్‌తో చర్చించారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్‌బాబు కొన్ని రోజుల క్రితం జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్‌కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా కలెక్టర్‌ను కలిసినట్లు తెలుస్తోంది.