రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని అరెస్ట్: తోపుదుర్తి

62చూసినవారు
AP: పోసాని కృష్ణమురళి అరెస్టును మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. రేపటి తేదీతో పోసానికి నోటీసులు జారీ చేయడం వెనుక పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తుందన్నారు. చంద్రబాబు తప్పిదాలను విమర్శించిన పోసానిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.

సంబంధిత పోస్ట్