ఏపీ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబు ఇవాళ విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జనవరి 15 నాటికి రూ.860 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్లకు ఇరువైపులా కంప చెట్లను తొలగించనుంది. కల్వర్టులను సైతం నిర్మించనుంది. దీనికోసం ప్రభుత్వం ఐఐటీ తిరుపతి, ఎస్ఆర్ఎం వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.