ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం కురిచేడు మండలంలో దర్శి తెలుగుదేశం పార్టీ మాజీ సమన్వయకర్త పమిడి రమేష్ పర్యటించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం శ్రావణం శుక్రవారం కల్లూరు గ్రామంలో మహిళలతో ఏర్పాటుచేసిన కోలాటం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.