ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రైతు సేవ కేంద్రాలలో 25% సబ్సిడీతో శనగ విత్తనాలు రైతులు పొందాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. జే. జే 11 శనగ విత్తనాలను సబ్సిడీ పై పొందేందుకు ముందస్తుగా మీ రైతు సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎకరాకు 40 కేజీలు శనగ విత్తనాలు 5 ఎకరాల వరకు అందించడం జరుగుతుందని ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని ఆయన అన్నారు.