గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన సిబియస్ఈ ట్యాబ్ ఆధారిత బేస్ లైన్ పరీక్షలను మండల విద్యాశాఖ అధికారి-2 కె. శర్వాణి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పెన్ను, పేపర్ అవసరం లేకుండా ట్యాబ్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం సాంకేతిక అభివృద్ధికి సూచికలనీ, ఈ తరహా పరీక్షలు విద్యార్థులకు సాంకేతిక సోపానాలుగా, నైపుణ్యాలకు బాసటగా నిలిచి ఉంటాయని అన్నారు. బాలికలు భయం వీడి సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని హితవు పలికారు.