
కంభం: తప్పిన పెనుముప్పు
ప్రకాశం జిల్లా కంభంలోని సాధుమియా వీధిలో ఓ విద్యుత్ స్తంభం బుధవారం అకస్మాత్తుగా నేలకొరిగింది. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని గుర్తించి విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్తు శాఖ అధికారులు మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు.