గిద్దలూరు: తుఫాను కారణంగా దెబ్బ తిన్న పంటలు

52చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారిపేట పరిసర ప్రాంతాలలో తుఫాను కారణంగా రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. పొగాకు, పత్తి, అరటిపంట వేసినా రైతులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టామని అప్పులు చేసి మరి పంటలు వేసినట్లుగా ఆదివారం రైతులు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రస్తుతం అధికారులు జరిగిన పంట నష్టం పై అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్