ప్రకాశం జిల్లా కంభంలోని సంఘ వీధిలో బుధవారం అక్రమంగా నిలువ ఉంచిన దీపావళి టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో రూ. 3 లక్షల విలువచేసే దీపావళి టపాసులు ఉన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక సీఐ మల్లికార్జున అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమంగా దీపావళి టపాసులను నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ మల్లికార్జున మీడియాకు వెల్లడించారు.