ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆదానిని తక్షణమే అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండు పార్టీల నాయకులు ఆదానికి జపం చేస్తున్నారని విమర్శించారు. ఆదానికి కట్టబెట్టిన పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.