ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని మిట్టమీదిపల్లి, తిప్పాయపాలెం గ్రామాలలో శనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని శనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. 25% సబ్సిడీపై రైతులకు శనగ విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఈ అవకాశాన్ని స్థానిక రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే రైతులను కోరారు.