ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ ప్రజలకు అందజేస్తున్న సాగర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ సాగర్ జలాలు వస్తున్న నేపథ్యంలో తగినన్ని మోటర్లు ఏర్పాటు చేసి దూపాడు సమ్మర్ స్టోరేజ్ ని నింపాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.