తర్లుపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి

61చూసినవారు
తర్లుపాడు: రైలు ఢీకొని వ్యక్తి మృతి
తర్లుపాడు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రమాదవశాత్తు మృతి చెందాడ అనే విషయం దర్యాప్తులో తెలియాల్సి ఉందని అన్నారు. మృతుడి వివరాలు గుర్తిస్తున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.

సంబంధిత పోస్ట్