మందమర్రి: సిట్టింగ్ పాయింట్ నిర్వాహకులకు జరిమాన

59చూసినవారు
మందమర్రి: సిట్టింగ్ పాయింట్ నిర్వాహకులకు జరిమాన
మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియా కనకదుర్గ వైన్స్ సిట్టింగ్ పాయింట్ నిర్వాహకులకు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. వైన్స్ షాపులో ఫ్రిడ్జ్ లో నిన్నటి చికెన్ నిల్వ ఉంచి ఈరోజు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మున్సిపల్ అధికారులకు గురువారం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి చికెన్ నిలువ చేయడాన్ని గుర్తించి నిర్వాహకులకు 2000 జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్