భారీ వర్షాల వలన ఎవరు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా తుఫాను దాటిన ఎదుర్కోటానికి ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బుధవారం మాట్లాడుతూ ముగ్గురు అదనపు ఎస్పీలు, నలుగురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బందితో 18 టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి టిముకు 20 మంది సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు బలగాలు ఉంటాయన్నారు.