మండలంలోని నందిపాడు వ్యవసాయ సహకార సొసైటీ సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహించనున్నట్లు సొసైటీ సీఈవో రామచంద్ర రెడ్డి తెలిపారు.మద్దిపాడులోని సొసైటీ కార్యాలయంలో జరిగే సమావేశానికి సంబంధించిన రైతులందరూ తప్పకుండా హాజరుకావాలని సొసైటీ సీఈవో కోరారు. రైతులకు సంబంధించిన పథకాలు, వడ్డీ టారిఫ్ గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.