కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని పుల్లల చెరువు ఎంపిటిసి సభ్యులు మేడికొండ. రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం పుల్లలచెరువులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి. ఎరిక్షన్ బాబు గెలుపు కోరుతూ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి గెలిస్తే సూపర్ 6 పథకాల అమలతో పాటుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు పారదర్శకంగా కొనసాగుతాయని అన్నారు. ప్రజలందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేయాలని కోరారు.