ప్రకాశం జిల్లా దోర్నాల మండలం బోడే నాయక్ తాండ గ్రామంలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. పశువుల దొడ్డిలో కొండచిలువ కనిపించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు కొండచిలువను బంధించారు. తర్వాత స్థానిక నల్లమల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పట్టుపడ్డ కొండచిలువ 7 అడుగులకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.