పుల్లలచెరువు మండలంలోని శతకోడులో గురువారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు గెలుపు కోరుతూ ఆయన కుమార్తె చెల్సియా ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆ పార్టీ నాయకులు ఎస్. కె హుస్సేన్ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. గూడూరి ఎరిక్షన్ బాబు, నారా చంద్రబాబు నాయుడు చిత్ర పటాలకు పాలాభిషేకం చేసారు. ఈ సందర్బంగా కార్యకర్తలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.