ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఏపీఎస్ఆర్టీసీ బస్సు టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్ తిరుపతిరావు మృతిచెందగా తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.