యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుండి ఎరిక్షన్ బాబు, వైసీపీ నుండి చంద్రశేఖర్, కాంగ్రెస్ నుండి అజితారావు పోటీలో ఉండగా ఈ ముగ్గురిలో విజయం ఎవరికి దక్కినా తొలిసారిగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. అంగబలం, అర్ధ బలం ఉన్నవారే కావడంతో ఇక్కడ గెలుపు కోసం సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.