ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఉరివేసుకొని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ పై ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో స్పందించిన స్థానిక టిడిపి నాయకులు ప్రత్యర్ధులు ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారని ఆరోపించారు.