యర్రగొండపాలెం ఎమ్మెల్యేకు పోలీసులు మరోసారి షాక్

56చూసినవారు
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. గతంలో మంత్రి నారా లోకేష్ ని ఎక్స్ వేదికగా విమర్శించగా టిడిపి నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోలీసులు ఎమ్మెల్యే చంద్రశేఖర్ పై కొత్త కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంగా పెద్దారవీడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి 41A నోటీసులు ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్