

దోర్నాల: ద్విచక్రవాహనంలో దూరిన పాము
ప్రకాశం జిల్లా దోర్నాలలో బుధవారం ఓ పాము అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలోకి పాము దూరింది. వాహనాన్ని మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లగా పాము మరో ద్విచక్రవాహనంలోకి దూరి హల్ చల్ చేసింది. ఆ పామును ద్విచక్ర వాహనం నుంచి బయటికి రప్పించేందుకు బైక్ మెకానిక్ ఇబ్బంది పడ్డాడు. గంటకు పైగా శ్రమించి ద్విచక్రవాహనంలో నుంచి పాముని వెలికి తీశారు.