మయన్మార్, థాయ్లాండ్లో సంభవించిన భారీ భూకంపాల కారణంగా 10వేలకు పైనే మరణించి ఉండొచ్చని అమెరికా అంచనా వేస్తోంది. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ యత్నిస్తోంది. ఈ దేశాలలో సహాయక చర్యలకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ప్రధాని మోదీ ఆదేశాలతో మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రిని, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు అందజేశారు.