భారీ భూకంపం మయన్మార్‌ను అతలాకుతలం చేసింది. పలు భవనాలు, వంతెనలు, గోపురాలు నెలమట్టమయ్యాయి. ఈ విధ్వంసంలో ఇప్పటివరకు సుమారు 200 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించగా. అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 1000 వరకు ఉండొచ్చని US జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. శిథిలాల కింద చాలామంది ఉండొచ్చని పేర్కొంది. ఇక అర్ధరాత్రి భూమి కంపించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు బ్యాంకాక్‌లో కూడా భారీ భూకంపం సంభవించింది.