AP: విశాఖపట్నం వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలోని ఒక ఇంట్లో జంట ఆత్మహత్యలు కలకలం రేపాయి. మర్రిపాలెం హర్షనగర్‌కు చెందిన అమీరుద్దీన్ ఖాన్ (36), సింహాచలం శ్రీనివాసనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని వెంకట దుర్గ (17) అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.