ALERT: 35 మండలాల్లో తీవ్ర వడగాలులు

62చూసినవారు
ALERT: 35 మండలాల్లో తీవ్ర వడగాలులు
AP: రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శనివారం రాష్ట్రంలోని 35 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 223 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యంలో 12, విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 6, అల్లూరిలో 3, కాకినాడలో 3, తూ.గో.లో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఆది, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడొచ్చని అంచనా వస్తోంది.

సంబంధిత పోస్ట్