ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్

68చూసినవారు
ఉపాధి కూలీలకు గుడ్ న్యూస్
AP: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులకు హాజరయ్యే కూలీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కనీస వేతనం రూ.307గా నిర్ణయించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి పెంచిన కొత్త వేతనం అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాగా, ఉపాధి పథకంలో కూలీలకు కేంద్రం ఏటా కనీస వేతనం రాష్ట్రాల వారీగా ప్రకటిస్తుంది.

సంబంధిత పోస్ట్