అనకాపల్లిలో భారీ గిరినాగు హల్‌చల్ (వీడియో)

58చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో భారీ గిరినాగు హల్‌చల్ చేసింది. పొలంలో సుమారు 15 అడుగుల గిరినాగును చూసిన రైతులు భయభ్రాంతులకు గురయ్యారు. పాము దగ్గరికి వెళ్లిన రైతులపై బుసలు కొడుతూ దూసుకెళ్లింది. దాంతో రైతులు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. గిరినాగు కోపాన్ని చూసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. పాము నుంచి దూరంగా ఉండండని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్