గిద్దలూరులోని నటరాజ్ థియేటర్ సమీపంలో సోమవారం ప్రజల గుండెలను పిండేసే సంఘటన కనిపించింది. ఓ వానరం తన పిల్ల వానరం మృతికి తల్లడిల్లి పోయింది. 3 రోజుల క్రితం అనారోగ్యంతో ఆ వానరం మృతి చెందింది. తల్లి పిల్లను వదిలి వెళ్లలేక అక్కడక్కడే 3 రోజుల నుంచి తిరుగుతూ దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. తన పిల్ల వానరం మృతిపై తల్లి రోధిస్తుండడం చూసి స్థానిక ప్రజలు చలించిపోయారు. విషయం అధికారులకు తెలిపారు.