ప్రకాశం జిల్లా మార్కాపురం కొండేపల్లి రోడ్డు లోని మున్సిపాలిటీ కి చెందిన ఓ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమణకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపాలిటీ అధికారులు సోమవారం స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో కూల్చివేశారు. గత ప్రభుత్వం హయాం నుంచే ఇక్కడ బిసి కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏర్పాటు చేయాలని స్థానిక బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.