ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్ అన్నారు. కనిగిరి పట్టణంలోని 4వ సచివాలయం ఆవరణలో గురువారం ఎన్జీవో సంఘ నాయకులతో కలిసి మున్సిపల్ చైర్మన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతుల్యం సాధించాలన్నా, సకాలంలో వర్షాలు కురవాలన్నా మొక్కలు పెంచవలసిన ఆవశ్యకత ఉందని ఆయన తెలిపారు.