టిడిపి అభ్యర్థులను గెలిపించండి
హనుమంతునిపాడుమండలం హనుమంతపురం గ్రామంలో బుధవారం కనిగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను మండల టీడీపీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి తో పాటు రజిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. సైకిల్ గుర్తు పై ఓటు వేసి రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి ఉగ్ర నరసింహ రెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.