కనిగిరి పట్టణంలోని గార్ల పేట రోడ్డు లో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పీజీ. జంగయ్య గురువారం పరిశీలించారు. నీటి వసతి లేక హాస్టల్ తాత్కాలికంగా మూసివేసి మరొక హాస్టల్ లో విద్యార్థులకు వసతి ఏర్పాటు చేశారని, వాచ్మెన్ కూడా రావటం లేదని, వంట మనిషి సమస్యను గంగయ్య కు వివరించారు. హాస్టల్ ను మళ్లీ తెరిపించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని గంగయ్య తెలిపారు.