సింగరాయకొండలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంత వద్ద గల బ్రాందీ షాపు ఎదురుగా ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి కారు ఢీ కొట్టింది. దింతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.