ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల లో ఆదివారం రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలను ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. సింగరాయకొండలో రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు జరగడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని అభినందించారు. కూటమి ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించే అంశంలో ఎప్పుడు ముందుంటుందని మంత్రి స్వామి అన్నారు.