విగ్రహానికి పూలమాలలు వేసి సంతాపం

262చూసినవారు
ఆర్టీసీ సమస్యలపై ముందుండి పోరాడిన వ్యక్తి

మార్కాపురం పట్టణంలోని స్థానిక కోర్టు సెంటర్లో సిపిఎం పార్టీ మార్కాపురం డివిజన్ వ్యవస్థాపక నాయకులు ఏనుగుల పుల్లయ్య వర్ధంతి సభ ఆదివారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సిపిఎం పార్టీ పచ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పుల్లయ్యగారు మార్కాపురం డివిజన్లో సిపిఎం పార్టీ అభివృద్ధికై , పేద ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేపట్టటానికి నిరంతరం పాటుపడ్డారన్నారు. మార్కాపురం డివిజన్లో వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కోసం సంఘాలను స్థాపించి ,వాటిని పటిష్టం చేసి అనేక సమస్యల పట్ల ముందుండి నడిపించి పోరాడన్నారు. ఎస్ఎఫ్ఐ వంటి విద్యార్థి సంఘాల ను ఏర్పాటు చేసి ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి పాటు పడ్డారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చేపట్టిన కార్యక్రమాలకు ఆయన ముందుండి నాయకత్వం వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు ఏనుగుల వివేకానంద స్వామి, సిపిఎం పార్టీ నాయకులు డీకే ఎం రఫీ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్