మూఢనమ్మకాలను పారద్రోలండి

891చూసినవారు
మూఢనమ్మకాలను పారద్రోలండి
జనవిజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు యుటిఎఫ్ కార్యాలయం దగ్గర జనవిజ్ఞాన వేదిక జెండాను జిల్లా ఉపాధ్యక్షుడు వరికుంట్ల వెంకటేశ్వర్ల ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ సైన్సు అభివృద్ధి చెందుతుందని, మూఢ నమ్మకాలను పారద్రోలాలన్నారు. సత్యాన్వేషణకు దేశ స్వావలంబనకు సమగ్రతకు ప్రపంచ శాంతికి సామాజిక అభివృద్ధికి సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓవి వీరా రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథాన్ని అవలంభించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.

జన విజ్ఞాన వేదిక డివిజన్ ప్రధాన కార్యదర్శి యు. వెంకటరావు మాట్లాడుతూ భారతీయ శాస్త్రవేత్త సీవి రామన్ తన ప్రయోగాల నుంచి రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భారత దేశానికి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతినీ గడించారాన్నరు. జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఏనుగుల రవికుమార్ శాస్త్రీయ పరిశోధనా ఫలాలు ప్రజలందరికి ఉపయోగపడేలా చేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. జన విజ్ఞాన వేదిక డివిజన్ నాయకులు ఎస్‌ఎండీ రఫీ, ఓ.చింటు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్