మార్కాపురం: పలు దుకాణాలు తనిఖీ చేసిన అధికారులు

69చూసినవారు
మార్కాపురం: పలు దుకాణాలు తనిఖీ చేసిన అధికారులు
ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో గురువారం బాల కార్మికులను గుర్తించే లక్ష్యంగా అధికారులు పట్టణంలో పలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు , కార్మిక శాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేసి దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 18సంవత్సరాల్లోపు బాల, బాలికలను పనులలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని వారికి ఎస్ఐ సైదుబాబు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్