మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు శనివారం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధికి తమ పార్టీ అవరోధం కాదని, అక్రమణాల తొలగింపులో అధికారులు, ప్రజా ప్రతినిధులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించకుండా వ్యవహరించారని ఆయన విమర్శించారు. అభివృద్ధికి తమ సహకారం ఉంటుందని, పార్టీపై ఆరోపణలు మానుకోవాలని సూచించారు.