సాయి డిగ్రీ కళాశాలలో సంక్రాంత్రి సంబరాలు

756చూసినవారు
సాయి డిగ్రీ కళాశాలలో సంక్రాంత్రి సంబరాలు
మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులోని సాయి డిగ్రీ కళాశాలలో శనివారం సంక్రాంతి, భోగి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ దుగ్గెంపూడి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఆనందంగా జరుపుకునే పండుగే సంక్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ గోరంట్ల చిన్నవెంకటరెడ్డి, ఏనుగుల రవికుమార్, సుంకరి వెంకటసుబ్బయ్య, డి.సురేంద్రరెడ్డి, బి.శ్రీరామ్ విద్యార్థులు తదితరులు పాల్గొని ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్