తర్లుపాడు: ఒకటో తారీకు కల్లా పెన్షన్లు పంపిణీ పూర్తవ్వాలి

53చూసినవారు
తర్లుపాడు: ఒకటో తారీకు కల్లా పెన్షన్లు పంపిణీ పూర్తవ్వాలి
ప్రకాశం జిల్లా తర్లుపాడు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఒకటో తారీకు కల్లా పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేలా వారికి సూచనలు సలహాలు ఇచ్చారు. 30వ తేదీ పెన్షన్ డబ్బులు బ్యాంకులలో డ్రా చేసుకొని నవంబర్ 1వ తేదీన మండలంలో అందరికీ పెన్షన్లు పంపిణీ పూర్తవాలన్నారు. నిర్లక్ష్యంగా ఉద్యోగులు ఎవరు వ్యవహరించరాదని ఎంపీడీవో హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్