ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఆదివారం రాత్రి కొండచిలువ కలకలం రేపింది. 7 అడుగులకు పైగా ఉన్న కొండచిలువ స్థానికంగా ఉన్న ఓ నీటి ట్యాంక్ వద్ద కనిపించింది. తీవ్ర ఆందోళన చెందిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నిరంజన్ కొండ చిలువను పట్టుకొని స్థానిక నల్లమల్ల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.