నవరాత్రుల సందర్భంగా గ్రామదేవత అమ్మవారి ప్రత్యేక పూజలు
నాగులుప్పలపాడు మండలము చిరువానప్పలపాడు గ్రామంలో గ్రామ దేవత అమ్మవారిని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి విశేషాలంకారము నిర్వహించారు. అమ్మవారిని గాజులతో అలంకరించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.