ఉత్తరప్రదేశ్‌లో ఓ హాస్టల్ మేనేజర్ రెచ్చిపోయాడు. ఇద్దరు విద్యార్థులను బెల్టులతో దారుణంగా కొట్టాడు. ఆగ్రాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. ఓ పీజీ హాస్టల్ ఇన్‌చార్జ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థులు నోట్లో గుడ్డలు కుక్కి, బెల్టులతో చితకబాదాడు. ఈ వీడియో తాజాగా బయటకు రావడంతో ఆగ్రా పోలీసులు విచారణ చేపట్టారు.