ఢిల్లీలో గురువారం పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ పంకజ్ జైన్ ను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని సూరారెడ్డిపాలెం వద్దనున్న ఐఓసి డిపో ని కొనసాగించవలసిందిగా ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. వెనకబడిన జిల్లా ప్రకాశం జిల్లా అని డిపో ని తీసివేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. సమస్య విన్న జైన్ సానుకూలంగా స్పందించారని మాగుంట తెలిపారు.