ఒంగోలు నగరంలోని ఏ1 ఫంక్షన్ హాల్ లో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారన్నారు. 1000 కి పైగా ఉద్యోగాలను కల్పించేందుకు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకొని, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు.