విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఎస్.వి.కె.పి కళాశాల ప్రిన్సిపల్ జి.ధర్మ నాయక్ అన్నారు. డి.పి రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ వారు దుగ్గెంపుడి పిచ్చి రెడ్డి గారి 2 వ వర్ధంతి సందర్భంగా తర్లుపాడు రోడ్ లోని సాయి డిగ్రీ కళాశాలలో "విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు" అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గా ధర్మ నాయక్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న ని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. చిన్నతనం నుంచే మంచి పనులు చేపడుతూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సాయి డిగ్రీ కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ దుగ్గేంపూడీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వ్యక్తుల ప్రవర్తనలను విశ్లేషించడం నాయకత్వం అన్నారు. సరైన నాయకత్వం ప్రవర్తన ఎప్పుడూ ఒక బృందాన్ని నడిపే దానీ పైనే ఆధారపడి ఉంటుందన్నారు.జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఏనుగుల రవికుమార్ మాట్లాడుతూ సమర్థ నాయకత్వం ఎప్పుడు భాగస్వామ్యంతో ఎంతో విలువను సృష్టిస్తోంది అన్నారు. పరస్పర లక్ష్యసాధనకు తోడుపడుతుందన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో నారాయణ, నాగేంద్ర, చంద్రిక,ఆదిలక్ష్మి,గీతాంజలి,యశస్వి నీ, కీర్తి, రామలక్ష్మిలకు ధర్మ నాయక్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.పి రెడ్డి సొసైటి సెక్రటరీ& కరస్పాండెంట్ దుగ్గేంపూడీ వెంకటేశ్వరరెడ్డి , సహాయ కార్యదర్శి డి.వెంకట నారాయణ రెడ్డి,ట్రెజరర్ వెంకట నారాయణమ్మ, కళాశాల అధ్యాపకులు ఏనుగుల రవికుమార్, సుంకరి వెంకటసుబ్బయ్య, చింతకుంట్ల శ్రీరామ్, గుంటి వెంకటేశ్వర్లు తదితరులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.