మీకోసం కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆమె పలు శాఖల అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రజల నుండి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. వారం నుండి మీకోసం కార్యక్రమంలో శాఖల వారి టేబుల్ లను ఏర్పాటు చేసి అర్జీలను సంబంధిత విభాగాలకి కేటాయించామని తెలిపారు.